అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్ల వెనుక ఉన్న రహస్యం ఎంటి ?
శబరిమల అయ్యప్ప ఆలయం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకుని తరిస్తారు. ఏడాదికి ఏడాది శబరిమల భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 18 మెట్లు. ఆయన శ్లోకంలో కూడా 18 మెట్ల ప్రస్థావన ఉంటుంది.
అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే.. ఖచ్చితంగా 18 మెట్లు ఎక్కాల్సిందే. అది కూడా తలపై ఇరుముడి పెట్టుకుని 18 మెట్లుఎక్కితేనే ఆ అయ్యన్ అయ్యప్ప స్వామి దర్శనభాగ్యం కలుగుతుంది. ఆలయ దర్శనానికి ముందు అనేక నియమాలు, పద్దతులు పాటించాలి. 41 రోజులు దీక్ష తీసుకుని భక్తులు స్వామి దర్శనానికి వెళ్తారు.
ఈ 18 మెట్లలో మొదటి ఐదు మెట్లను పంచేంద్రియాలుగా సూచిస్తారు.
అంటే నేత్రాలు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శలకు సంకేతం.
పంచేంద్రియాం :
మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి విషయాలు వినాలి, మంచి విషయాలు మాట్లాడటానికి నాలుకను, ఎప్పుడూ తాజా శ్వాస పీల్చుకోవాలని సూచిస్తాయి. అలాగే.. స్పర్శ జపమాల ద్వారా ఎప్పుడూ ఆ దైవనామస్మరణలో ఉండాలని తెలుపుతుంది.
తర్వాత 8 మెట్లు మెట్ల తర్వాతి 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం.
అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మధం, మాస్తర్యం, అసూయ, దంబంనుసూచిస్తాయి.
అష్టరాగాలు :
ఈ అష్టరాగాలను చక్కటి సందేశాన్ని ఇస్తాయి. మనుషులు అహంకారాన్ని విడనాడి, స్వార్థాన్ని వదిలిపెట్టాలి. దేవుడిని స్మరించుకుంటూ ఉండాలి. చెడు మార్గంలో వెళ్తున్నవాళ్లకు మంచి మార్గంలో వెళ్లాలని సూచించాలి.
తర్వాత 3 మెట్లు
తర్వాత మూడు మెట్లు సత్వం, తామసం రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలు బద్దకాన్ని విడిచిపెట్టాలని సూచిస్తాయి.
చివరి 2 మెట్లు
చివరి రెండు మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనమందరం జ్ఞానం పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని విడవాలి అని తెలియజేస్తుంది.
కొబ్బరికాయ :
మెట్లు ఎక్కేటప్పుడు తలపై ఇరుముడి పెట్టుకోవాలి. ఈ ఇరుముడిని దేవాలయంలో ఇచ్చి. ప్రసాదం ఇంటికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
పరిపూర్ణత :
శబరిమల ఆలయంలోని 18 మెట్లు ఎక్కిన వాళ్లు జ్ఞానంతో పాటు సంపద పొంది జీవితంలో పరిపూర్ణులవుతారని ఒక నమ్మకం ఉంది.
Tags: ayyappa 18 steps,ayyappa 18 steps names in telugu,ayyappa 18 steps meaning,ayyappa 18 steps gods names in telugu,ayyappa 18 steps price,ayyappa 18 steps online,ayyappa 18 steps gods names,ayyappa 18 steps song lyrics,ayyappa 18 steps online purchase. about ayyappa steps, hindudevotionalhub,
0 Comments