అయ్యప్ప స్వామి మాలధారణకు కావలసిన వస్తువులు మరియు నియమాలు, నిబంధనలు.

 

ayyappa-mala-rules-in-telugu

అయ్యప్ప స్వామి మాలధారణకు కావలసిన వస్తువులు మరియు నియమాలు, నిబంధనలు.

 1. బట్టలు - వస్త్రాలు : నల్లరంగు దుస్తులు రెండు లుంగీలు, రెండు షర్టులు, రెండు తువ్వాళ్ళు, ( డ్రాయర్లు, బనియన్లు కావలసినవి ) నల్లని దుప్పటి ఒక్కటి. 


2. పువ్వుల మాలలు : తులసి మాల గాని, గంధంమాలగాని, తామరమాలగాని, రుద్రాక్షమాలగాని, మీకు నచ్చినవి రెండు మాలలు తీసుకోవాలి. 


౩. వూజకు కావలనిన సామాన్లు : కొబ్బరికాయ, అరటిపళ్ళు ( 6 - ఆరు), కర్పూరం, నువ్వుల నూనె ( 100 (గ్రాములు ), ఊదివత్తులు, కుంకుమ, విభూతి, చందనం ( 1 - డబ్బా), జీడిపప్పు, కిస్‌మిస్‌, పువ్వులు, పటికబెల్లం, పంచదార. 


నియమాలు - నిబంధనలు


 మీరు ముందుగా పైన చెప్పబడిన సామాన్లు గురుస్వావిగారి వద్దకు తీనుకొని వెళ్ళి మాలవేయుమని ప్రార్ధించాలి. తెల్లవారు జమున్నే లేచి, మీరు తల స్నానం చేసిన తరువాత, తడిబట్టలతో అయ్యప్పస్వామి దగ్గర మీరు తీసుకెళ్ళిన సామాన్లతో, పూజచేని తరువాత మాల మీ మెడలోవేసి, మిమ్ములను దీక్షకు ప్రారంభం చేస్తారు. వారి ఆశీర్వాదం తీసుకొని మీ ఇంటికి లేదా, ఆశ్రమానికి గాని ఈ దీక్షకు ప్రత్యేకించబడిన ఒక గదియందు ( కడిగిన, నున్నం వేసిన, ముగ్గులు పెట్టీ యున్నటువంటిది) పూయవలేను. 


ayyappa-mala-rules-in-telugu

విఘ్నేశ్వరుని ఫోటో, అయ్యప్ప ఫోటో, కుమార స్వామి ఫోటోలు 'పై విధముగా ఉంచవలెను. ఇతర దేవతల ఫోటోలు కూడా) మీరు ప్రతిదినం వేకువ జామున అనగా (నూర్యోదయమునకు పూర్వం) లేచి కాలకృత్యములు తీర్చుకొని, చల్లని నీటితో తలస్నానం చేయవలెను. చేసి, వీరు కట్టి విడిచిన బట్టలు తదడివి, మడిగా ఆరవేసుకొనవలెను. క్రితం సారి తడిపి ఆరవేసిన బట్టలుగాని, తడిబట్టలతోగాని మొదట నుదుట బొట్టు ధరించి, తరువాత దీపం వెలిగించి శరణుఘోష చెప్పవలెను. తరువాత అష్టోత్తర నామావళితో పూజ చేయవలెను. నైవేద్యం (అరటిపండుగాని, మీకు తోచినదిగాని) పెట్టి, హారతి ముందు విఘ్నేశ్వరునికి, కుమారస్వామికి, అయ్యప్పకు వరుసగా ఇచ్చి సాష్టాంగ నమస్కారము, తదుపరి ముందుగా మీ మెడలో వున్న మాలకు హారతి ఇచ్చి, తరువాత హారతి తీసుకొనవలెను. మీరు ఇంటివద్ద పూజాకార్యక్రమము ముగించుకొని, మీకు నచ్చిన దేవాలయమునకు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి, మీకు కలిగిన అల్పాహారం తీసుకొనవలెను. (ఉదయం కార్యక్రమం పూర్తి). 


మధ్యాహ్నం తలస్నానం చేసిన తరువాత, మీకు కలిగిన సాత్విక ఆహారం భుజించవలెను. 


సాయంత్రం : సూర్యాస్తమయం తరువాత పయిన చెప్పిన విధముగా స్నానం చేసుకొని, పూజా కార్యక్రమం ముగించుకొని, వీలైతే భజనలు చేనుకొని, రాత్రికి కూడ అల్పాహారం తీసుకొనవలెను.


 ( రాత్రి 12 గంటలలోపు భిక్ష కార్యక్రమము పూర్తి చేయవలెను. )




Tags: ayyappa mala, hindudevotionalhub, ayyappa mala rules, ayyappa mala rules in telugu, ayyappa mala mantra, ayyappa mala pooja vidhanam, deeksha rules, ayyappa mala pooja samagri list, ayyappa mala pooja samagri list, ayyappa mala pooja samagri list in telugu,

Post a Comment

2 Comments

  1. Swamiye Sharanam Ayyappa

    ReplyDelete
  2. Chaala baaga chepparu,...
    Dhanyavadamulu meeku. .

    ReplyDelete